Multiplex Movie Ticket 75 Rupees: మల్టీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఎం.ఎ.ఐ)సినీ అభిమానులకు శుభవార్త చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, వేవ్ సహా 4000లకుపైగా థియేటర్లలో రూ. 75కే సినిమాలను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. సెప్టెంబరు 16న 'నేషనల్ సినిమా డే'గా పిలుస్తూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది.
ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో రూ.75కే సినిమా.. ఆఫర్ ఆ ఒక్క రోజే - ఒక్కరోజు ఆఫర్ మల్టీప్లెక్స్ మూవీ టికెట్ ధర
మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు తగ్గుతున్నాయ్! సాధారణంగా సిటీల్లో ఏ మల్టీప్లెక్స్‌కు వెళ్లినా సరే.. రెండు నుంచి మూడు వందల రూపాయల టికెట్ రేటు ఉంటోంది. అటువంటి టికెట్‌ను కేవలం 75 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించి.. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. ఇంతకీ ఆ ఆఫర్ ఎప్పుడు? ఏ సినిమాలకు వర్తించొచ్చు?
ఆయా థియేటర్లలో నేరుగా టికెట్ తీసుకుంటేనే రూ. 75కి లభించనుంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేయాల్సివస్తే టికెట్ ధరకు అదనంగా ఇంటర్నెట్ ఛార్జీ, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. కొవిడ్ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో సెప్టెంబరు 16న సినిమా డేగా ప్రకటించారు. యూఎస్, యూకేల్లో సెప్టెంబరు 3న సినిమా డే సెలబ్రేషన్స్ జరిగాయి.
సెప్టెంబరు 16న విడుదలయ్యే సినిమాలకే కాకుండా అప్పటికే ప్రదర్శితమవుతున్న చిత్రాలకూ ఈ అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 3న విడుదలయ్యే 'బ్రహ్మాస్త్ర', సెప్టెంబరు 16న విడుదలయ్యే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కోటికొక్కడు', 'శాకిని-డాకిని' తదితర చిత్రాలకు ఇది మంచి పరిణామం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కరోజుకే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎక్కువ మంది మల్టీప్లెక్స్ అనుభూతిని పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.