పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో కథానాయిక పాత్రకు మొదట దీపికను అనుకోలేదట. మరో బాలీవుడ్ భామను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారట. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెతో ఎందుకు 'ప్రాజెక్ట్ కె' చేయడం లేదు?
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో మృణాల్ ఠాకూర్!.. నిర్మాత అశ్వనీ దత్ క్లారిటీ - producer Aswini dutt project K
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో మృణాల్ ఠాకూర్‌ను తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించారట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీ దత్ తెలిపారు.
మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఉంటే బాగుంటుందని నాగ్ అశ్విన్ భావించారట. ఈమేరకు మృణాల్ ఠాకూర్‌ను ఎంచుకున్నారట. ఇదే సమయంలో దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన 'సీతారామం' కథ విని.. ''ఈ ప్రేమకథకు మృణాల్ అయితే చక్కగా నప్పుతుంది. మీకు నచ్చితే ఆమెను ఈ సినిమాకు తీసుకోండి. నేను 'ప్రాజెక్ట్ కె' కోసం మరో హీరోయిన్‌ను ఎంచుకుంటా'' అని నాగ్ అశ్విన్ సూచించినట్లు నిర్మాత అశ్వనీ దత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా, మృణాల్ 'సీతారామం'లో భాగమై మంచి విజయాన్ని అందుకుంది.
ఇదీ చూడండి: ఈ వారం విడుదలయ్యే సినిమాలు.. ఓటీటీలో సందడి చేయనున్నవివే