Mrunal Thakur Dating Rumors :వరుస సినిమాలతో టాలీవుడ్లో సందడి చేస్తోంది బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. 'సీతారామం' సినిమాతో పాన్ ఇండియాలో ఫేమస్ అయిున ఈ అమ్మడు.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న', రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు 'హాయ్ నాన్న' ప్రమోషన్స్‌లో సందడి చేసిన ఈ చిన్నది.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి నిర్వహించిన దీపావళి పార్టీలో మెరిసింది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో బుట్టబొమ్మలా ముస్తాబై వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ పార్టీలో మృణాల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు ఆమె నెట్టింట ట్రెండ్ అవుతోంది.
శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్.. పార్టీలో కలియతిరుగుతున్న సమయంలో బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షా చేయి పట్టుకుని కనిపించింది. పార్టీలో ఈ ఇద్దరూ కాసేపు అలానే తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారు. దీంతో ఇప్పుడు మృణాల్ రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె బాద్షాతో డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.