తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమా. కానీ పేరు, ఫేమ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్లో సంపాదించింది. కుర్రాళ్లయితే ఆమెపై మనసు పారేసుకున్నారు. తన రూపాన్ని గుండెల్లో దాచేసుకున్నారు. ఈ మధ్య ఆమె.. పెళ్లి-పిల్లలు గురించి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగా వైరల్ అయ్యాయి. దీంతో ఇండస్ట్రీలో ఎక్కడా చూసిన ఆమె పేరే వినిపిస్తోంది. పలువురు స్టార్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట.
ఒక్క తెలుగు సినిమాతో స్టార్ హీరోయిన్గా.. ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా? - మృణాల్ ఠాకూప్ చిన్ననాటి ఫొటో
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోయింది. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.
ఇంతకీ ఆమె ఎవరో కాదు... కుర్రాళ్ల మనసు దోచిన సీత. 'సీతారామం'లో సీతగా మన అందరి హృదయాలను హత్తుకున్న మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. 'కుంకుమ భాగ్య' సీరియల్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. వెండితెరపై విట్టి దండూతో ఎంట్రీ ఇచ్చి.. లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్ లాంటి సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది విడుదలైన 'జెర్సీ' రీమేక్‌తో ఇంకాస్త గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ మధ్య వచ్చిన 'సీతారామం'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇందులో సీతామహాలక్ష్మిగా.. అందం, అభినయంతో ప్రతిఒక్కరిని కట్టిపడేసింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె.. పిప్పా, ఆంఖ్ మిచోలీ, గుమ్రా, పూజా మేరీ జాన్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: ఎర్ర గౌనులో జెనీలియా.. ఇంతందంగా ఉందేంట్రా బాబు..