Mr Pregnant Premiere Show Response :బిగ్‌బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటించింది. పురుషుడు ప్రెగ్నెంట్ అయితే అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్.. శ్రీనివాస్ వింజనంపాటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
అయితే రిలీజ్‌కు ముందు గురువారం 200 మంది ప్రెగ్నెంట్ మహిళలకు మూవీ మేకర్స్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్ షో చూసిన ఆడియెన్స్ నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా కాన్సెప్ట్ బాగుందంటూ.. స్పెషల్ షో చూసిన ప్రేక్షకులు పాజిటీవ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతవరకూ ఈ జోనర్ సినిమాలు రాలేదని.. ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలంటూ ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు.
స్పెషల్ షో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు.. శుక్రవారం థియేటర్లలో కూడా ఇలాంటి స్పందన వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి.. సినిమాలో నటింటిన నటీనటులకు మంచి గుర్తింపు తీసుకొస్తుందా అనేది చూడాలి.
ఇక సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ.. "అమెరికాలో థామస్ అనే పురుషుడు గర్భం దాల్చాడని చదివాను. అప్పటి నుంచి ఈ జోనర్లో ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నా. ప్రెగ్నెంట్ మహిళల కష్టాలు అనే కోణంలో తీస్తే.. డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే ఈ కథలో మంచి లవ్‌స్టోరీ యాడ్ చేశా. పురుషుడు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కథలోని ఎమోషనల్స్ని నమ్మి ఈ సినిమా తీశాను. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది" అని అన్నారు.