తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రవితేజ లుక్​ అదుర్స్​.. 'బింబిసార' రిలీజ్​ డేట్​ ఫిక్స్

Movie Updates: సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో రవితేజ 'టైగర్​ నాగేశ్వరరావు', కల్యాణ్​రామ్​ 'బింబిసార', కిచ్చ సుదీప్​ 'విక్రాంత్​ రోణాా' చిత్రాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

movie updates
movie updates

By

Published : Apr 2, 2022, 1:26 PM IST

Tiger Nageswararao Motion poster: రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. నేడు(శనివారం) జరిగిన సినిమా లాంఛింగ్​ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్​ చిరంజీవి.. సినిమా ప్రీలుక్​ మోషన్​ పోస్టర్​​ను విడుదల చేశారు. కథానాయికగా నుపూర్ సనన్​ నటించనుంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. 'ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్' అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. మోషన్​ పోస్టర్​లో రవితేజ లుక్​ అదిరింది.

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'

Bimbisara Release Date: నందమూరి కల్యాణ్​రామ్ హీరోగా తెరకెక్కిన 'బింబిసార' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్​ను బట్టి చూస్తే.. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్, ఎలివేషన్స్ సీన్స్​ అయితే అదిరిపోయే రేంజ్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

కల్యాణ్​ రామ్​ 'బింబిసార'

Vikram Rana Trailer: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్న భారీ సినిమా 'విక్రాంత్ రోణా'. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ స్థాయిలో జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్​డేట్​ టీజర్​ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేశారు. ఈ టీజర్​లో గ్రాండ్​ విజువల్స్​ చూస్తుంటే 3డిలో మంచి ట్రీట్​ ఇచ్చేలా కనిపిస్తుంది.

ఇదీ చదవండి: కలెక్షన్లలో ఏమాత్రం తగ్గని 'ఆర్ఆర్ఆర్'.. అన్నీ కుదిరితే సీక్వెల్?

ABOUT THE AUTHOR

...view details