Jai Bheem dadasaheb phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో జై భీమ్ సినిమాను పలు అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అవార్డులు దక్కించుకుంది ఈ చిత్రం. సినిమాలో రాజకన్ను పాత్ర పోషించిన మణికందన్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు.
Vishwak sen in Vijayawada: యువ కథానాయకుడు విశ్వక్ సేన్ విజయవాడలో సందడి చేశారు. తన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటించిన విశ్వక్ సేన్.... అక్కడి ఓ షాపింగ్ మాల్లో హంగామా చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని స్థానిక ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హలీమ్ రుచి చూసి స్థానిక యువతతో సెల్ఫీలు దిగి అలరించారు. మే 6న విడుదల కానున్న తన చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
Major movie update: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మేజర్'. అడివి శేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సైతం ఆయనే సమకూర్చారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ మేజర్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్‌పై అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. మే 4న ఉదయం 10.08గంటలకు ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.