ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ నటి ఇంట చోరీ.. దీపావళికి వెళ్లి వచ్చేలోపు ఇల్లంతా ఊడ్చేశారు! - వినయా ప్రసాద్ ఇంట్లో చోరీ

ప్రముఖ నటి వినయా ప్రసాద్ ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బు, బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

vinaya prasad
vinaya prasad
author img

By

Published : Oct 30, 2022, 6:52 PM IST

Vinaya Prasad: ప్రముఖ నటి వినయా ప్రసాద్​ ఇంట దొంగలు పడ్డారు. రూ.7 వేలు మినహా మిగతాదంతా ఊడ్చుకెళ్లారు. లాకర్​లో ఉన్న బంగారు నగలు, సొమ్మును దొంగలించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ జరిగింది..
దీపావళి పండుగ కోసం నటి వినయా ప్రసాద్.. అక్టోబరు 22న తన కుటుంబంతో స్వగ్రామం ఉడిపికి వెళ్లారు. తిరిగి ఆమె అక్టోబర్ 26న సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరులో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోని గదిలో ఉన్న లాకర్‌లో ఉంచిన నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని ఆమె గుర్తించారు. వెంటనే నందిని లే అవుట్​ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details