Mokshagna Latest Photos : నందమూరి ఫ్యామిలీలో పెళ్లి సందడి జరిగింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు ఇంకా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తమ సోదరి కొడుకు(Nandamuri suhasini son marriage) పెళ్లి వేడుక కావడం వల్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకలో కనిపించి సందడి చేశారు. ఎంతో హుందాగా కనిపించారు. అన్నీ తామై పెళ్లి వేడుకని ముందుండి చూసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ ఫంక్షన్లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నందమూరి సోదరులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఒకే దగ్గర చేరి ఫోటోలకు పోజులిచ్చారు. అందరూ కలిసి సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.
అసలే ఇప్పటికే మోక్షజ్ఞ(mokshagna movies) టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తాడో అని ఆశగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు.. ఈ పిక్స్ చూసి తెగ పండగ చేసుకుంటున్నారు. తన సోదరులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలసి మోక్షజ్ఞ ఇలా కనిపించడం ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సోదరులంతా స్టైలిష్ షేర్వాణీ కుర్తా ధరించి రాయల్ లుక్‌లో మెరిశారు. ఇకపోతే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదేల దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరితో కలిసి మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తాడో చూడాలి..