తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జార్జి కుట్టి ఈజ్​ బ్యాక్​, దృశ్యం 3 కన్ఫార్మ్​ చేసిన మూవీటీమ్​ - దృశ్యం 3 సినిమా

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మర్డర్​ మిస్టరి సినిమా దృశ్యం సిరీస్​. ఇప్పుడీ సిరీస్​లో భాగంగా మూడో పార్ట్​ రాబోతుంది. ఈ విషయాన్ని మూవీటీమ్​ అధికారంగా ప్రకటించింది.

drishyam 3
drishyam 3

By

Published : Aug 28, 2022, 12:54 PM IST

Mohanlal Drishyam 3 confirmed 'దృశ్యం' సిరీస్​ అభిమానులకు గుడ్​న్యూస్. ఈ సిరీస్​లో భాగంగా మూడో పార్ట్​ సిద్ధమవుతోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడో భాగాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో దర్శకుడు జీతూజోసెఫ్‌ చెప్పారు. అయితే ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాత ఆంటోని పెరుంబవూర్​(perumbavoor)​. రీసెంట్​గా​ జరిగిన ఓ అవార్డ్​ ఫంక్షన్​లో దృశ్యం 3 తెరకెబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

మలయాళంలో జీతూజోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమా.. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. మలయాళంలో మోహన్​లాల్​ నటించగా, తెలుగులో విక్టరీ వెంకటేష్​, తమిళంలో కమలహాసన్, హిందీలో అజయ్​ దేవగణ్​ ప్రధాన పాత్ర పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. కథానాయకుడు తన సినిమా తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ కథ.

కాగా, ఇటీవలే దృశ్యం 3కు సంబంధించిన ఓ పోస్టర్​ కూడా సోషల్​మీడియాలో వైరల్​ అయింది. ఆ పోస్టర్‌లో మోహన్‌లాల్‌ సంకెళ్లతో కనిపించారు. మరి ఈసారి మూడో భాగంలో కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక తప్పించుకున్నాడా? అనేది ఆసక్తికరం.

ABOUT THE AUTHOR

...view details