తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాటు నాటు' అంత గొప్ప పాటేమీ కాదు.. ఆస్కార్​ వస్తుందనుకోలేదు: కీరవాణి

'నాటు నాటు' సాంగ్​కు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ఇంకా పలు విషయాల గురించి చెప్పారు. ఆ సంగతులు..

Keeravani naatu naatu song
'నాటు నాటు' అంత గొప్ప పాటేమీ కాదు.. ఆస్కార్​ వస్తుందనుకోలేదు: కీరవాణి

By

Published : Mar 25, 2023, 7:12 PM IST

ఇండియన్​ సినీ ప్రేక్షకులతో పాటు.. హాలీవుడ్‌ ఆడియెన్స్​ను సైతం ఉర్రూతలూగించిన పాట 'నాటు నాటు'. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ పాటకు ఆస్కార్‌ సైతం ఫిదా అయి.. బెస్ట్​ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్​ ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌లకు అవార్డును అందించింది. అయితే ఈ ప్రదానోత్సవ వేడుక అనంతరం ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చారు కీరవాణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'నాటు నాటు' పాట గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. సంగీతపరంగా 'నాటు నాటు' అంత గొప్ప పాటేమీ కాదని అన్నారు. అయితే స్పెషల్‌ కమర్షియల్‌ సాంగ్‌ అని చెప్పారు. దర్శకుడు రాజమౌళి మేకింగ్‌, ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ వల్లే ఆ సాంగ్​కు వరల్డ్​వైడ్​గా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.

"నాటు నాటు ఓ పక్కా మాస్‌ సాంగ్‌. డ్యాన్స్‌ చేయాలనిపించే పాట. టెక్నికల్‌గా, కళాత్మకంగా మాట్లాడితే.. టాలెంట్​ను చూపించడానికి వీలుండే, శాస్త్రీయ సంగీతం, గొప్ప కవిత్వం, ఇంకా సంక్లిష్టమైన ఆర్కెస్ట్రేషన్‌కు ఆస్కార్‌ పురస్కారాలు వస్తాయని మీరు అనుకోవచ్చు. అయితే, 'నాటు నాటు' అద్భుతమైన కమర్షియల్‌ సాంగ్‌. ఫాస్ట్‌ బీట్‌ నంబర్‌. ఆస్కార్‌ సంగతి పక్కన పెడితే.. అసలు అవార్డు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు" అని కీరవాణి చెప్పుకొచ్చారు.

ఇంకా చెప్పాలంటే దర్శకుడి మేకింగ్‌, కొరియోగ్రాఫర్‌ వల్ల ఈ పాటకు అందం వచ్చింది. ఈ సాంగ్​ను చూస్తే.. సినిమా కథకు మిళితమై ఇందులో ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది. ఇక స్పెషల్‌ సిగ్నేచర్‌ డ్యాన్స్‌ స్టెప్పుల వల్ల తెగ వైరల్‌ అయింది. ఈ ఘనత మొత్తం రాజమౌళి, ప్రేమ్‌ రక్షిత్‌లకే దక్కుతుంది. అలాగే చంద్రబోస్‌కు కూడా దక్కుతుంది. ఈ విషయాన్ని గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ఫంక్షన్​లోనే చెప్పాను. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం కేవలం . 'నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు' రెండు లైన్లను మాత్రమే బాగా గుర్తు పెట్టుకుంది. ఈ ఘనత చంద్రబోస్‌కే చెందుతుంది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ పాటను చేశాం. కానీ.. తెలుగు సాంగ్​నే ఆస్కార్‌కు రిజిస్టర్‌ చేశాం. ఆ విషయంలో చంద్రబోస్‌ లక్కీ. తెలుగు వెర్షన్‌ వింటుంటే.. రిథమిక్‌గా ఉండటమే కాదు మరింత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇతర భాషా రచయితలు కూడా తమ వంతుగా మంచి కృషి చేశారు. పాట కన్నా కూడా 'నాటు నాటు' అందరి నోటా ఒక మంత్రంలా మారిపోయింది" అని పేర్కొన్నారు.

తనని 'ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌' అనడం నచ్చదని కీరవాణి అన్నారు. అది తన పనిని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పారు. 'ఆస్కార్‌ ' అనేది చాలా పెద్ద పేరు. ఒకట్రెండుసార్లు అంటే బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అలా పిలుస్తుంటే దానికి విలువ ఏం ఉంటుంది" అని వెల్లడించారు.

ఇదీ చూడండి:మూవీ లవర్స్​ సిద్ధంగా ఉన్నారా?.. ఇకపై థియేటర్లలో వారానికో పాన్​ ఇండియా మూవీ!

ABOUT THE AUTHOR

...view details