Mithun Chakraborthy: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు భాజపా నాయకుడు అనుపమ్ హజ్రా తెలిపారు. ఆయన ట్విట్టర్లో మిథున్ చక్రవర్తి ఫొటోను షేర్ చేసి.. త్వరగా కోలుకోవాలని కోరారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సీనియర్ నటుడికి అస్వస్థత.. ఫ్యాన్స్ ఆందోళన - సీనియర్ నటుడికి అస్వస్థత
ప్రముఖ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యం బారినపడ్డారు. ఆయన ఆసుపత్రిలో ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

దీనిపై మిథున్ చక్రవర్తి కుటుంబసభ్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు. మిథున్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారట. అందుకే ఆసుపత్రిలో చేరారట. ఆపరేషన్ జరిగిందని, క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలను ఓ ఊపుఊపేశారు మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ నటించి మెప్పించారు. దీంతోపాటు 'హునార్‌బాజ్' షోకి జడ్జిగా వ్యవహరించారు.
ఇదీ చదవండి:పాపం ఆమిర్ ఖాన్ కుమార్తె.. వింత జబ్బుతో బాధపడుతోందట!