స్టార్ యాంకర్ సుమ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ప్రస్తుతం ఈ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం వద్ద సుమ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రాళ్లకు నాచు పేరుకుపోగా.. కొంచెం కాలు కదిపే సరికి.. ఆమె జారి కింద పడ్డారు. అయితే ఆమె కింద పడినా.. బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం తనంతట తానే పైకి లేచారు సుమ.
అయ్యో సుమ.. పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే..! - jayamma panchayathi shooting
'జయమ్మ పంచాయితీ' సినిమా షూటింగ్ సమయంలో యాంకర్ సుమకు పెను ప్రమాదమే తప్పింది. ప్రమాదానికి సంబంధిన వీడియోను సుమ సోషల్ మీడియోలో షేర్ చేయగా.. అది ఇప్పుడు వైరల్గా మారింది.
సుమ
అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను శనివారం తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు సుమ. 'కొద్దిలో ప్రమాదం తప్పింది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూశాక.. సుమ అభిమానులు, నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లు వెత్తుతున్నాయి. 'సుమక్క మీకేమైనా అయితే.. ప్రీరిలీజ్లు, టీఆర్పీ రేటింగ్లకు ఇబ్బందే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి:భర్తతో కత్రినా రొమాన్స్.. స్విమ్మింగ్ పూల్లో రచ్చ మామూలుగా లేదుగా!
Last Updated : May 7, 2022, 10:42 PM IST