తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Jawan ott release netflix

Miss Shetty Mr Polishetty VS Jawan OTT Release Date : హీరోయిన్ అనుష్క మిస్ శెట్టి మిస్టర్​ పోలిశెట్టి -బాలీవుడ్ బాద్​ షా షారుక్ జవాన్​ రెండు చిత్రాలు ఒకే ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రానున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 3:20 PM IST

Miss Shetty Mr Polishetty VS Jawan : సీనియర్ హీరోయిన్ అనుష్క దాదాపు ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో నేడు(సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్ కూడా జవాన్ చిత్రంతో భారీ స్థాయిలో నేడే ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. సినిమా రిలీజై ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే ఈ రెండు చిత్రాల ఓటీటీ వివరాల గురించి ప్రేక్షకులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Miss Shetty Mr Polishetty OTT Platform Release Date : ఇందులో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయానికొస్తే.. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్​గా నటించగా.. అనుష్క చెఫ్ పాత్రలో నటించింది. నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Jawan OTT Release Date : ఇక జవాన్ విషయానికొస్తే.. ఈ సినిమా తొలి షో నుంచే సూపర్ హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార బాలీవుడ్ అరంగేట్రం ఇచ్చింది. క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందించారు. స్టార్‌ యాక్టర్​ విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. దీపికా పదుకునే గెస్ట్ రోల్​లో యాక్షన్ సీక్వెన్స్​తో ఆకట్టుకుంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఓటీటీ డీల్​ను నెట్​ఫ్లిక్స్​తో కుదుర్చుకుందట. అంటే మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, జవాన్‌.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్సే దక్కించుకుంది.

సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు.. నెల రోజులకు ఓటీటీలోకి వస్తుంటాయి. అదే ఫ్లాప్‌ టాక్‌ దక్కించుకున్నాయంటే.. అంతకన్నా ముందే ఓటీటీలో ప్రత్యక్షమైపోతుంటాయి. హిట్‌ టాక్‌ వస్తేనే కాస్త ఆలస్యంగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతాయి. ఇప్పుడీ రెండు సినిమాలు మంచి టాక్​నే అందుకున్నాయి కాబట్టి.. అక్టోబర్‌ నెల ప్రారంభ వారాల్లో స్ట్రీమింగ్​కు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. మిస్​శెట్టి 40 రోజుల తర్వాత అందుబాటులో అవకాశం ముందని అంటున్నారు. జవాన్​ను 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్​కు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Jawan Movie Telugu Review : 'జవాన్​'లో అన్ని షేడ్స్​.. షారుక్​ ప్రేక్షకులను మెప్పించారా ?

Miss Shetty Mr Polishetty Review : అనుష్క- నవీన్‌ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే ?

ABOUT THE AUTHOR

...view details