Miss ShettyMR Polishetty Box Office Collection : సీనియర్ హీరోయిన్ అనుష్క దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల రోజే షారుక్ ఖాన్ జవాన్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల.. మంచి ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా మౌత్ టాక్‌తో హిట్ స్టేటస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను అందుకుంటూ ముందుకెళ్తోంది.
కామెడీ ఎంటర్టైనర్ అండ్ సరోగసీ కాన్సెప్ట్‌తో ఫన్నీగా వచ్చిన ఈ చిత్రం.. పదో రోజు కూడా మంచిగానే వసూలు చేసింది. వీకెండ్ కావడంతో సినిమాకు కాస్త కలిసొచ్చింది. మొత్తంగా ఈ చిత్రం పది రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ. 20.23 కోట్లు, రూ.34.75 కోట్లు అందుకుందట. ఓవర్సీస్లో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. యూఎస్ఏ బాక్సాఫీస్ ముందు ఇప్పటివరకు 1.5 మిలియన్ డాలర్స్(Miss Shetty MR Polishetty Overseas Collections) అందుకున్నట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫార్మ్ చేశారు. 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను కూడా చేరుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ టీవీ సొంతం చేసుకుంది.
లాభాలు ఎంతంటే?.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 12.50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లు నమోదైంది. ఈ చిత్రం ఇప్పుడు పది రోజుల్లో రూ.20 కోట్ల వరకు అందుకుంది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ.6 కోట్ల వరకు లాభాలు అందుకుంది.