ఐశ్వర్యా రాయ్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు - నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ లేటెస్ట్ న్యూస్
అందాల నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు రెవిన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే
ప్రముఖ నటి ఐశ్యర్యరాయ్ బచ్చన్‌కు సిన్నార్ రెవిన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. సిన్నార్‌లో ఆమె భూమికి పన్ను చెల్లించని కారణంగా ఈ నోటీసులు పంపించినట్లు సమాచారం. నోటీసుల ప్రకారం సంవత్సరం నుంచి ఆమె రూ. 22 వేల భూమి పన్ను ఎగ్గొట్టినట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు పన్ను చెల్లించని మరో 1200 మందికి కూడా నోటీసులు పంపించారు. నోటీసులు అందినవారిలో గుమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్బీ కుంజీర్ ఇంజనీర్, ఐటీసీ మరాఠా లిమిటెడ్, ఎస్కే శివరాజ్, హోటలే లీలా వెంచర్ లిమిటెడ్, కుక్రేజా డెవలపర్ కార్పొరేషన్, రామ హ్యాండిక్రాఫ్ట్, ఓపీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ గుజరాత్ బిందు వాయు ఉర్జా ప్రైవేట్ లిమిటెడ్, గుమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర డిఫాల్టర్లకు, మెట్‌కాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చోటాభాయ్ జేతాభాయ్ పటేల్ అండ్ కంపెనీ వారు ఉన్నట్లు తెలుస్తుంది. వీరు పన్నులు చెల్లించక పోవటం వల్ల రూ.1.11 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మార్చిలోగా వారంతా పన్ను చెల్లించాల్సిందిగా ఈ నోటీసులలో పేర్కొన్నారు.