Merry Christmas Movie Trailer: కోలీవుడ్ స్టార్ హీరో, విలన్, నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్లో మరో సినిమాకు సైన్ చేశారు. 'బద్లాపూర్', 'అంధాదూన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్‌తో కలిసి ఆయన'మేరీ క్రిస్మస్' అనే సినిమాకు సైన్ చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దాంతో పాటు రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. తమిళం, హిందీలో ఒకే కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ట్రైలర్లు మాత్రం వేర్వేరుగా విడుదల చేశారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చెందిన రెండు ట్రైలర్లు మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ సినిమాలో ఫుల్ ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు ట్రైలర్‌లు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఎందుకంటే ఒక చిత్రం నుంచి రెండు ట్రైలర్లు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో కొత్త ట్రెండ్‌ను సినీవర్గాలు చెబుతున్నాయి.