తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సల్మాన్​ ఖాన్​ హత్య బెదిరింపులు వారి పనే.. త్వరలోనే అరెస్ట్​ చేస్తాం' - సల్మాన్​ ఖాన్​ వార్తలు

Salman Khan: బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హత్యా బెదిరింపుల లేఖ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ వ్యవహారంలో పంజాబ్​ కాంగ్రెస్​ నేత సిద్ధూ హత్య కేసు నిందితులు లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ ప్రమేయాన్ని ధ్రువీకరించారు. నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Salman Khan
Salman Khan

By

Published : Jun 10, 2022, 9:26 AM IST

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​, ఆయన తండ్రి సలీమ్ ఖాన్​ హత్యా బెదిరింపుల వ్యవహారంపై ముంబయి పోలీసులు.. కీలక పురోగతి సాధించారు. బెదిరింపుల లేఖ విషయంలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సిద్ధేష్ కాంబ్లే అలియాస్ సౌరభ్ మహకల్​(20) విచారణలో ఈ విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

"ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఆ బెదిరింపుల లేఖను సల్మాన్​ తండ్రి సలీం ఖాన్‌కు పంపించాడు. అందుకోసం అతడి గ్యాంగ్​లోని ముగ్గురు వ్యక్తులు రాజస్థాన్‌లోని జాలోర్ నుంచి ముంబయికి వచ్చారు. అక్కడికి వచ్చి సౌరభ్​ మహకల్​ను కలిశారు. అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వారిని త్వరలోనే అరెస్ట్​ చేస్తాం" అని పోలీసులు గురువారం తెలిపారు.

సోమవారం సల్మాన్​ఖాన్​.. హైదరాబాద్​కు బయలుదేరే ముందు ముంబయి పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని స్టేట్​మెంట్​లో సల్మాన్ స్పష్టంచేశారు. ఇటీవలి కాలంలో తనకు ఎవరితోనూ గొడవలు కూడా లేవని పేర్కొన్నారు. అంతకుముందు సలీమ్ ఖాన్ స్టేట్​మెంట్​ను కూడా రికార్డు చేశారు పోలీసులు. బాంద్రాలో సల్మాన్​ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ జరిగింది: ఆదివారం ఉదయం సల్మాన్​ తండ్రి సలీమ్​ ఖాన్​.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్​కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్​ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:సల్మాన్​ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details