'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ గ్రాండ్ సక్సెస్‌లను అందుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస విజయాలతో ఫుల్ జోషలో ఉన్న చిరు.. ప్రస్తుతం తన కొత్త చిత్రాల విషయంలో ఫుల్ జోరు కొనసాగిస్తున్నారు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న ఆయన.. ఒకొక్కటిగా వాటిని రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 'భోళాశంకర్'ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఆయన.. తన కొత్త సినిమాలను లైన్లో పెట్టే పనిలోనూ బిజీగా ఉన్నారు. దీనికోసం ఇప్పటికే పలువురు యువ దర్శకులతో కలిసి కథల విషయంలో కసరత్తులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్ కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి సినిమా దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. మల్టీస్టారర్‌గా ఇది రూపొందనుందని అంటున్నారు. ఒకవైపు స్క్రిప్ట్ పనులు చకచకా అవుతుండగా.. మరోవైపు నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు మరో యంగ్ హీరో నటించనున్నారట. ఇప్పటికే 'డీజే టిల్లు'తో క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపించింది. ఇప్పుడు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరినైనా ఒకరిని ఒప్పించాలని మూవీటీమ్ ప్రయత్నాలు చేస్తోందట. మరి ఈ ఇద్దరిలో చిరుతో కలిసి నటించేదెవరన్నదే ఇప్పుడు చిత్రసీమలో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అలానే ఈ సినిమాలో నటించబోయే యంగ్ హీరోకు జోడీగా నటించేందుకు శ్రీలీలను కూడా సంప్రదించినట్టు తెలిసింది.