Acharya Movie Review: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు.. చిరు-చెర్రీల స్క్రీన్ప్రెసెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Acharya Movie Review: ఆచార్య అలరించాడా? టాక్ ఎలా ఉందంటే..? - ఆచార్య రివ్యూ
Acharya Movie Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' థియేటర్లలో సందడి మొదలుపెట్టేసింది. రామ్‌చరణ్‌తో చిరు తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ లభించిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
'ఆచార్య'.. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కొరటాల శివ దర్శకుడు. చిరు, చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి:'ఆ పాట వల్ల చిరంజీవి ఇమేజ్ ఏం దెబ్బతినదు'