తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా' - ram charana and upasana in anjana devi birthday

ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిరోజు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఆమెతో దిగిన ఫ్యామిలీ ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం మెగా బ్రదర్స్ ముగ్గురూ ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

mega star chiranjeevi mother birthday
megastar chiranjeevi post birthday wishes to his mother

By

Published : Jan 29, 2023, 6:03 PM IST

Updated : Jan 29, 2023, 6:50 PM IST

ఆదివారం తన తల్లి అంజనాదేవి పుట్టిరోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆమెతో దిగిన ఫ్యామిలీ ఫొటోలను షేర్‌ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి. "ఈరోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అభిమానులు కూడా ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. మెగా ఇంట జరిగిన ఈ సంబరలకు ఫ్యామిలీ మొత్తం హాజరవ్వగా.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రామ్‌చరణ్​ను , ఆయన భార్య ఉపాసనను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

వేడుకల్లో రామ్​చరణ్​
వేడుకల్లో ఉపాసన కొణిదెల

ఇక ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.250కోట్లు వసూళ్లు చేసింది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన చిరంజీవి ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 'నాటు నాటు' పాట ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపిక కావడం దేశానికే గర్వకారణమని అన్నారు. మరోవైపు సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించనున్న OG(#OG) సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వీటి కోసం పవన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

వేడుకల్లో మెగా కుటుంబం
Last Updated : Jan 29, 2023, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details