తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అర్జున్​ రెడ్డి' డైరెక్టర్​ దూకుడు.. చిరుతో సినిమాకు స్టోరీ రెడీ.. త్వరలోనే! - చిరంజీవి సందీప్​ రెడ్డి వంగా

అర్జున్​ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా. కెరీర్​ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఆయన.. మెగాస్టార్​ చిరంజీవితో సినిమా తీయాలని ప్లాన్​ చేస్తున్నారు. త్వరలోనే చిరుకు సందీప్​ కథ వినిపించనున్నారట.

Etv Bharat
megastar chiranjeevi next movie with director sandeep reddy vanga

By

Published : Mar 24, 2023, 9:48 AM IST

అర్జున్​ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్​ ఇండస్ట్రీలో దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా బ్లాక్​ బస్టర్​ కావడంతో స్టార్​ హీరోలు సైతం ఆయన వెంటపడ్డారు. కానీ ఎక్కడా తొందరపడకుండా.. కెరీర్​ విషయంలో సందీప్​ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వరుసగా స్టార్​ హీరోలతో సినిమాలు చేసుకుంటున్నారు. అర్జున్​ రెడ్డి రీమేక్​తో బాలీవుడ్​లోనూ అడుగుపెట్టారు. అక్కడ కూడా సూపర్​ హిట్​ కొట్టారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి చేతిలో ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్​త్​ స్ఫిరిట్ మూవీ సెట్స్​పైకి వెళ్లిపోయింది. ఈ సినిమా చేస్తూనే.. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​తో మరో ప్రాజెక్ట్​ను సందీప్​ రెడ్డి ప్రకటించారు. ఒక్కొక్కటిగా సినిమాలు కంప్లీట్ చేస్తూ రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కన్ను మెగాస్టార్ చిరంజీవి పైన పడింది. ఎలాగైనా మెగా హీరోతో సినిమా చేయాలని ఫిక్స్​ అయ్యారు సందీప్.

చిరంజీవితో సినిమా సందీప్ రెడ్డి డ్రీమ్ అంట. అయితే అది ఇప్పుడు పెద్ద విషయం కాదు. సందీప్ కథ చెపుతానంటే.. చిరంజీవి కాదనకపోవచ్చు. కానీ సందీప్​ రెడ్డి వంగా మాత్రం పక్కా ప్లాన్​తో ఉన్నారట. మెగాస్టార్ మెచ్చేలా కథను తయారు చేస్తున్నారట. ఎలాగైనా సింగిల్ సిట్టింగ్​లో సినిమాను ఓకే చేసేయాలని రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం బాలీవుడ్​లో స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​తో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు సందీప్​ రెడ్డి వంగా. ఆ సినిమా రిలీజ్​ తర్వాత ప్రభాస్​ మూవీని కంప్లీట్​ చేయబోతున్నారు​. అల్లు అర్జున్​ కూడా పుష్ప-2 షూటింగ్​ పూర్తి అయ్యాక సందీప్​ ప్రాజెక్ట్​లో జాయిన్​ కానున్నారు.

మరోవైపు, చిరంజీవి కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రంలో సూపర్​ హిట్​ సాధించారు. త్వరలోనే ఆయన నటిస్తున్న భోళాశంకర్​ రిలీజ్​ కానుంది. తమిళ హీరో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రానికి రీమేక్​గా భోళా శంకర్​ సినిమా తెరకెక్కుతోంది. మెహర్​ రమేశ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర, కె.ఎస్. రామారావుతో పాటు అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయనకు చెల్లెలుగా కీర్తి సురేశ్​ నటిస్తోంది. మరి సందీప్​ రెడ్డి వంగా కథకు చిరు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తారో లేదో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details