తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అదిరిపోయేలా 'బాస్​ పార్టీ' ప్రోమో.. చై 'NC 22' పోస్టర్​ అదుర్స్​ - నాగ చైతన్య కొత్త సినిమా

మెగస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని బాస్​ పార్టీ సాంగ్ ప్రోమో​ విడుదలైంది. మరోవైపు, హీరో నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​.

megastar chiranjeevi
మెగస్టార్​ చిరంజీవి

By

Published : Nov 22, 2022, 1:58 PM IST

Waltair Veerayya First Single Promo: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆయన సందడి చేశారు. ఇందులో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. గాడ్‌ఫాదర్ మాత్రం అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే వరుసలో ఆయన నటిస్తోన్న మరో చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇదివరకే విడుదలైన ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి తొలి పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేసింది.

ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు బాబీ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ అవ్వనుంది.

నాగచైత‌న్య న్యూ మూవీ పోస్టర్‌
నాగచైత‌న్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'NC 22'. బంగార్రాజు సినిమా తర్వాత కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే ప్రీ లుక్‌ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్.

నాగచైతన్య ఎన్​సీ22 పోస్టర్​

చైతూ ఇందులో శివ అనే పోలీస్​ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు ప్రీ లుక్‌తో అర్థమవుతోంది. పోలీసులు శివ చుట్టూ చేరి గన్​లు పట్టుకుని ఆయనను అదిమిపట్టినట్లు పోస్టర్‌లో చూడొచ్చు. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రీ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు దర్శకులు. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.

ఇదీ చదవండి:

'చంద్రముఖి' సీక్వెల్​లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్​​!

రూ. 100 కోట్ల ఛాన్స్‌.. మోహన్‌లాల్‌, వెంకటేశ్‌ మిస్సయ్యారా?

ABOUT THE AUTHOR

...view details