తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్​లో 'వీరయ్య'.. బాలీవుడ్​లో 'పఠాన్'​.. బాక్సాఫీస్​ షేక్​! - షారుక్​ పఠాన్ హిందీ​ బాక్సాఫీస్ కలెక్షన్

అటు టాలీవుడ్​లో ఇటు బాలీవుడ్​లో రిలీజైన ఇద్దరు అగ్రతారల సినిమాలు బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఓ వైపు వాల్తేర్​ వీరయ్య రిలీజైన 14 రోజులకు ఇంకా జోరు కొనసాగిస్తుండగా షారుక్​​ పఠాన్ సైతం రిలీజైన రెండు రోజులకే రూ. రూ.100కోట్ల కలెక్షన్స్​ను దాటేసింది. ఆ వివరాలు..

waltair veerayya and pathan box office collection
waltair veerayya and pathan box office collection

By

Published : Jan 27, 2023, 2:07 PM IST

Updated : Jan 27, 2023, 2:16 PM IST

మెగాస్టార్​ చిరంజీవి, మాస్​ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద తన జోరును ఇంకా కొనసాగిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. అయితే తాజాగా వీరయ్య రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.103.89కోట్లు నెట్​, 168.05 గ్రాస్​ వచ్చినట్లు ట్రేడ్​ వర్గాలు సమాచారం. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి సుమారు రూ.124.27కోట్ల నెట్​, 212.40 కోట్లు గ్రాస్​ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓవరాల్ బిజినెస్​ రూ.88కోట్లు కాగా బ్రేక్​ ఈవెన్​ రూ.89కోట్లు అని సమాచారం. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే రూ.35.27కోట్ల లాభం వచ్చినట్లు సినీ వర్గాల టాక్​.అయితే ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్ల డాలర్స్​ క్లబ్‌లోకీ ప్రవేశించిన విషయంపై మెగస్టార్​ ఆనందం వ్యక్తం చేస్తూ యూఎస్​లో వివిధ ప్రాంతాల అభిమానులతో వీడియో కాల్​లో మాట్లాడారు

. కాగా, చిరు-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మంచి హిట్ ను అందుకుంది. ఇందులోని యాక్షన్, డ్యాన్స్​లతో పాటు అన్నదమ్ముల సెంటిమెంట్ ఎలిమెంట్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రకాష్ రాజ్, బాబీ సింహ లాంటీ స్టార్​ యాక్టర్స్​ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రుతి హాసన్, కేథరిన్​లు కథానాయికలుగా..వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

బాలీవుడ్​లో 'పఠాన్​' జోరు..
రిలీజైన రెండు రోజులకే షారుక్​ పఠాన్​ పలు సినిమాల రికార్డులను బద్దల కొడుతోంది. బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్​ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా..రెండో రోజు దాదాపు ₹70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా రూ.120కోట్ల వరకు సాధించినట్లు తెలిసింది. ఇక ఈ చిత్రంలో షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పోషించారు.

Last Updated : Jan 27, 2023, 2:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details