చిరు ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్, గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది - GOD FATHER TEASER
మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టీజర్ విడుదలైంది. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులకు సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం 'గాడ్‌ఫాదర్' టీజర్‌ను విడుదల చేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. నయనతార, సల్మాన్‌ఖాన్, పూరిజగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' రీమేక్‌గా 'గాడ్‌ఫాదర్' తెరకెక్కుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌నిర్మిస్తున్నాయి.