తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డైరెక్టర్ బాబీకి చిరు ఖరీదైన గిఫ్ట్!.. ఏమిచ్చారో తెలుసా? - waltair veerayya updates

వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబీ కొల్లికి మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా సూపర్ సక్సెస్ కావడమే కాకుండ్ అతడి అంకిత భావాని ఫిదా అయిన మెగాస్టార్.. ఖరీదైన కానుక ఇచ్చారట.

megastar-chiranjeevi-expensive-gifted-to-waltair-veerayya-director-bobby-kolli
megastar-chiranjeevi-expensive-gifted-to-waltair-veerayya-director-bobby-kolli

By

Published : Jan 19, 2023, 4:50 PM IST

సంక్రాంతికి మెగా సక్సెస్‌ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా.. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్దు కలెక్షన్లతో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే డైరెక్టర్ బాబీ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణంతో గుప్పెడంతో శోకంలో ఉన్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కాకుడదనే ఉద్దేశ్యంతో 'వాల్తేరు వీరయ్య' చిత్రీకరణకు హాజరయ్యారు. సినిమాపై తనకున్న అంకిత భావానికి తాను ఫిదా అయ్యానని మెగాస్టార్ ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో భాగంగా చెప్పారు. తాజాగా 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు బాబీకి ఊహించని బహుమతి ఇచ్చినట్లు సమాచారం.

సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారట. 'వాల్తేరు వీరయ్య' హిట్ కావడంతో ఆయనను స్వయంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించడమే కాకుండా భోజనం ముగిశాక లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

అయితే ఈ అంశంపై మన మెగాస్టార్ కానీ.. దర్శకుడు బాబీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇందులో నిజం తెలియాలంటే ఇద్దరిలో ఎవరొ ఒకరి నుంచి స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రం కాసులవర్షాన్ని కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తున్నామని అభిమానులు అంటున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేశారు. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details