తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాకు ఇష్టమైన రాజకీయ నేత ఆయనే'.. మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు - మెగాస్టార్ చిరంజీవి వాజ్​పేయి మీద కామెంట్లు

మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటర్య్వూ చేశారు. అందులో భాగంగా పూరీ సంధించిన ప్రశ్నలకు చిరంజీవి హుషారుగా సమాధానమిచ్చారు. ఇంటర్య్వూలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్.

megastar chiranjeevi interview with puri jagannath
megastar chiranjeevi interview with puri jagannath

By

Published : Oct 12, 2022, 10:19 PM IST

Updated : Oct 12, 2022, 11:04 PM IST

తనకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు అటల్​ బిహారి వాజ్​పేయీ అని.. ఆయన నిజమైన స్టేట్స్​మన్ అని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. 'గాడ్​ ఫాదర్' సినిమా ప్రమోషన్​లో భాగంగా చిరంజీవిని దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పూరీ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. అయితే చిరంజీవి మరో గుడ్​ న్యూస్​ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో కామెడీ ఓరియెంటెడ్​ సినిమాలు కచ్చితంగా చేస్తానని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి, పూరి జగన్నాథ్

ఇంటర్య్వూలో పూరీ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనికి అంతే సులువుగా సమాధానమిచ్చారు మెగాస్టార్. అందులో భాగంగా మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే... 'ఇప్పటి వాళ్లలో ఎవరూ లేరు. నాకు చాలా ఇష్టమైన రాజకీయ నాయకుడు లాల్​ బహుదూర్ శాస్త్రి. ఆయన గొప్ప నాయకుడు.. మాహానుభావుడు' అని కొనియాడారు. ఆ తర్వాత 'అటల్​ బిహారి వాజ్​పేయీ అద్భుతమైన నాయకుడు' అని.. 'రియల్​ స్టేట్స్​మన్' అని అన్నారు.

ఆ తర్వాత స్క్రిప్ట్​లు ఎలా సెలెక్ట్​ చేసుకోవాలనే ఉద్దేశంతో అడిగిన ప్రశ్నకు 'స్టోరీ నా హృదయానికి టచ్​ కావాలి... పాటలు, కామెడీ, ఫైట్స్​ అన్నీ.. ఓ స్త్రీ మూర్తికి అలంకారాల లాంటివి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లాప్​లు వస్తాయి. మనం మానవ మాత్రులం.. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి' అని చెప్పుకొచ్చారు. 'ప్రేక్షకులు మామూలు వాళ్లు కాదు.. ముందు అలా ఎలా గెస్ చేస్తారు' అని సినిమాను ముందుగానే ప్రేక్షకులు హిట్​ అని చెబుతారు అన్నారు. పూరీ.. సల్మాన్ ఖాన్​ గురించి అడిగిన ప్రశ్నకు.. 'అతడు నాకు తమ్ముడి లాంటి వాడు' అని చెప్పారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూరీ జగన్నాథ్.. గోవర్ధన్ అనే యూట్యూబర్ పాత్ర చేశారు. యువ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. నయనతార, సముద్ర ఖని, సల్మాన్​ ఖన్​ కూడా పలు పాత్రలు చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల అయిన 'గాడ్​ ఫాదర్'... బాక్సాఫీస్​ వద్ద ఘన విజయం సాధించింది.

ఇవీ చదవండి :మహిళా కమిషన్ చీఫ్​కు రేప్ వార్నింగ్.. 'ఆ బిగ్​బాస్ కంటెస్టెంట్​ను బహిష్కరించండి'

ఒంటిపై దుస్తులన్నీ విప్పేసిన నటి.. ఇరాన్ మహిళలకు సంఘీభావం

Last Updated : Oct 12, 2022, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details