తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా ఫ్యాన్స్​కు మాస్​ ట్రీట్​.. 'భోళా శంకర్​' ట్రైలర్​ వచ్చేసిందిగా.. - భోళా శంకర్​ మూవీ సాంగ్స్

Bhola Shankar Trailer : మెగాస్టార్‌ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'భోళాశంకర్‌' నుంచి తాజాగా ఓ ట్రైలర్​ విడుదలైంది. మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

bhola shankar trailer
bhola shankar

By

Published : Jul 27, 2023, 4:23 PM IST

Updated : Jul 27, 2023, 5:20 PM IST

Bhola Shankar Trailer : టాలీవుడ్​ మెగాస్టార్‌ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'భోళాశంకర్‌'. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుండగా.. మూవీ టీమ్​ మెగా ఫ్యాన్స్​ కోసం ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ను ఇచ్చింది. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ విడుదల చేశారు. చిరు పంచ్‌ డైలాగ్స్‌, ఎక్స్​ప్రెషన్స్​.. కీర్తి సురేశ్‌ నటనతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎమెషన్స్​తో పాటు యాక్షన్​ కూడా కావాల్సినంత ఉందని తాజాగా విడుదలైన ట్రైలర్​తో నిరూపితమైంది.

Bhola Shankar Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై అనిల్​ సుంకర, కే.యస్. రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి,తమన్నా , కీర్తి సురేశ్ లీడ్ రోల్స్​లో మెరుస్తుండగా.. రఘుబాబు, సుశాంత్, రవిశంకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా తమిళంలో విడుదలై సెన్సషన్​ క్రియేట్​ చేసిన అజిత్​ 'వేదాళం'కి రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రమోషన్స్​లోనూ అదే జోరు..
Bhola Shankar Songs :సినిమా రిలీజ్​ కంటే ముందు నుంచే ప్రమోషన్లలో జోరుగా ఉన్న 'భోళా శంకర్ ' టీమ్​.. ఇందులో భాగంగా సినిమా నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా 'మిల్కీ బ్యూటీ' అనే మూడో పాటకు సంబంధించిన వీడియోను నెట్టింట వదిలారు. విదుదలైన కొద్ది సేపట్లోనే నెట్టింట మంచి టాక్​ అందుకున్న ఈ సాంగ్​.. నెట్టింట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్​కు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. అంతే కాకుండా ఆ మధ్య విడుదల చేసిన 'జామ్ జామ్ జజ్జనకా' అనే పాట కూడా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది.

Last Updated : Jul 27, 2023, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details