మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆచార్య ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ త్వరలోనే ఆచార్య ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించింది. ధర్మ పరిరక్షణ కథాంశంతో కొరటాల శివ ఆచార్యను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా ఆచార్య ట్రైలర్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
యానిమల్‌లో రష్మిక ఫిక్స్..
ఫస్ట్ సినిమా 'అర్జున్ రెడ్డి'ని హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించి బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. అక్కడ స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యాడు. ఆయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా ఫిక్స్ అయ్యిందని పలు ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ టాక్ ని నిజం చేస్తూ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ షూటింగ్ ఈ వేసవి నుంచి స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు.
'ఆన్ ది వే' టైటిల్ లోగో..
హైదరాబాద్ రహదారులపై పూర్తి స్థాయిలో నిర్మించిన చిత్రం 'ఆన్ ది వే'. ఎస్ఎస్ క్రియేటివ్ కమర్షియల్స్, సంధ్య 35 ఎంఎం ప్రజెంట్స్ సంస్థలు కలిసి అంతా కొత్తవాళ్లతో నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోను డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ఆవిష్కరించారు. క్రైమ్ కామెడి థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందన్న సిద్ధు.. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 'ఆన్ ది వే' మంచి విజయం సాధించిన నటీనటులకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి హరి పెయ్యాల దర్శకత్వం వహించిగా మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
'ఆన్ ది వే' టైటిల్ లోగో..