మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆచార్య ట్రైలర్ విడుదలకు సంబంధించి అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 12న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
మెగాస్టార్ ఆచార్య ట్రైలర్.. బాలీవుడ్‌లోకి తేజ.. 'సలార్' సర్ప్రైజ్ - director-teja bollywood entry
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. అలాగే దర్శకుడిగా తొలిసారి హిందీలో మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు తేజ.
హిందీలోకి తేజ: తన సినిమాలతో ఎంతోమంది కొత్తవారిని టాలీవుడ్‌కు పరిచయం చేసిన తేజ.. తొలిసారి ఆయన బాలీవుడ్లో దర్శకత్వం వహించబోతున్నారు. కెమెరామెన్‌గా ఇప్పటికే హిందీలో చాలా సినిమాలు తేజ.. దర్శకుడిగా మాత్రం మొదటిసారి బాలీవుడ్‌లోని అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు హిందీ ప్రాజెక్ట్స్‌కు తేజ ఓకే చెప్పారు. 'జఖామి' సినిమాతో పాటు.. 'తస్కరీ' అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను ఎన్‌హెచ్ స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫ్లిల్మ్స్ సంస్థలతో కలిసి.. టైమ్ ఫ్లిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించనుంది.
Salaar Release Date Announcement:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా నుంచి.. ఆదివారం సర్ప్రైజ్ రానుంది. ఉదయం 11:15 గంటలకు సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అయితే చిత్ర బృందం ఏం చేబుతుందా? అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. సలార్ విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.