Waltair Veerayya Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారట. బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో చిరంజీవికి జంటగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్ టీజర్ ద్వారా తెలుస్తోంది.
'వాల్తేరు వీరయ్య' ఐటెం సాంగ్.. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌కు చిరు ఫిదా! - Waltair Veerayya music
మెగాస్టార్ చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. దాంతో వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా డీఎస్పీకే సంగీతం బాధ్యతల్ని దర్శకుడు బాబీ అప్పగించారు. అయితే మూవీలో ఉన్న ఐటెం సాంగ్‌కు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌కు చిరు ఫిదా అయ్యారట.
'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఆరు పాటలు ఉండగా.. ఇందులో ఒకటి ఐటెం సాంగ్. ఆ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఇంటస్ట్ర్‌తో ఈ సాంగ్‌కు మంచి ట్యూన్స్ అందించారని.. అవి విన్న చిరంజీవి ఇంప్రెస్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి.
రవితేజ కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఆయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి. అలాగే ఓ సాంగ్‌లో చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.