టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్సీ 15'. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శరవేంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను కర్నూలుకు షిప్ట్ చేశారు డైరెక్టర్ శంకర్. కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వద్ద 'ఆర్సీ 15' టీమ్ సందడి చేసింది. అక్కడ అభ్యుదయ పార్టీ అంటూ బ్యానర్లు, రాజకీయ నాయకుడిగా రామ్చరమ్ కటౌట్లు వెలిశాయి. అయితే ఇవన్నీ షూటింగ్లో భాగమే. షూటింగ్ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వారిని నియంత్రించేందుకు కర్నూలు పోలీసులు షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. కాగా, గురువారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద షూటింగ్ చేసిన మూవీ టీమ్ ఇప్పుడు కర్నూల్లో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.
రాజకీయ నేతగా చరణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు.. పోలీసుల ఆంక్షలు! - కర్నూల్లో ఆర్సీ 15
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా 'ఆర్సీ 15'. గత కొంతకాలంగా చిత్రీకరణలో బిజీగా ఉన్న మూవీ టీమ్.. తాజాగా కర్నూల్లో సందడి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది 'ఆర్సీ15'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్. జె. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇటీవలే మళ్ళీ కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టింది.