తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వరుణ్​ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ​.. వధువు ఎవరంటే? - నాగబాబు లేటెస్ట్ యూట్యూబ్​ ఇంటర్వ్యూ

టాలీవుడ్​లోని మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచిలర్స్​ అంతా ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా శర్వానంద్​ తన పెళ్లి విషయాన్ని ప్రకటించగా.. ఇప్పుడు మెగా హీరో వరుణ్​ తేజ్​ కూడా పెళ్లి పీటలెక్కనున్నట్లు హీరో నాగబాబు వెల్లడించారు. ఆ విషయాలు మీ కోసం..

varun tej
varun tej marriage

By

Published : Jan 31, 2023, 3:37 PM IST

Updated : Jan 31, 2023, 3:46 PM IST

సినీ ఇండస్ట్రీలోని మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్స్​ ఒక్కొక్కరుగా ఓ ఇంటివారవుతున్నారు. ఇప్పటికే నితిన్‌, రానా, నిఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలంతా తమ ఇష్టమైన వారితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా శర్వానంద్‌ కూడా ఇదే దారిలోకి వచ్చాడు. ఇక మిగిలిన వారంతా ఎప్పుడు ఈ గుడ్​ న్యూస్​ను వెల్లడిస్తారంటూ తమ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సమయంలో మరో యంగ్​ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు స్వయాన ఆ హీరో తండ్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగా హౌస్​ యంగ్​ హీరో వరుణ్​ తేజ్​.

కాగా ఇటీవలే ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు తన తనయడు పెళ్లి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ విషయాన్ని వరుణ్‌ అధికారికంగా ప్రకటిస్తాడని పేర్కొన్నారు. అయితే అమ్మాయి ఎవరనే విషయాన్ని సీక్రెట్​గా ఉంచారు నాగబాబు. పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఆ విషయాలన్ని వరుణ్‌ తేజ్‌ తప్పకుండా తెలియజేస్తాడని తెలిపారు.

అయితే ఇటీవలే లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్​లో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్​ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఓ వ్యాపారవేత్త కూతురిని కూడా వరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సైతం వినిపించాయి. అయితే ఆ విషయాలపై నాగబాబు స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుణ్‌ తేజ్​ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎస్‌వీసీసీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీకి బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్​లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Jan 31, 2023, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details