యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కొద్ది దూరం నడిచిన ఆయన.. ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి తీసుకెళ్లారు.
తారకరత్న ఆరోగ్యంపై మెగా హీరో ఎమోషనల్ పోస్ట్.. అన్న త్వరగా కోలుకోవాలంటూ.. - సాయి ధరమ్ తేజ్ తారకరత్న
యువగళం పాదయాత్రలో ఉన్నట్టుంది అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్యంపై మెగా హీరో స్పందించారు. 'అన్నా త్వరగా కోలుకోవాలి' అంటూ సోషల్ మీడియో వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కాగా, తారకరత్నకు ఆస్వస్థతకు గురైన వార్తలతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

కాగా, సినీ రాజకీయ ప్రముఖులు తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు. పూర్తి ఆరోగ్యవంతుడిగా తారకరత్న తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు. తాజాగా సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తారకరత్న కోలుకోవాలని ప్రార్థించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "ఈ వార్త చాలా నిరుత్సాహానికి గురిచేసింది. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా తారకరత్న అన్న. మీరు ఆరోగ్యంగా, దృఢంగా తిరిగి రావాలని మా ప్రార్థిస్తున్నాము" అని పేర్కొన్నారు. కాగా, తారకరత్నకు అకస్మాత్తుగా ఇలా జరగడం వల్ల అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఫ్యాన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.