Mega 157 Latest Update : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ - 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనున్నా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ను దర్శకుడు వశిష్ఠ నెటిజన్లతో పంచుకున్నారు. "మెగా చిత్రానికి మెగా ఆరంభం. ప్రీ ప్రొడెక్షన్ వర్క్‌తో #MEGA157 మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సినిమాటిక్ అడ్వెంచర్‌లోకి తీసుకుళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చారు. దానితో పాటు ఓ ఫొటోను జోడించారు. అందులో చిరంజీవితో పాటు దర్శకుడు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, యూవీ నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Mega 157 Movie : చిరు పుట్టినరోజును పురస్కరించుకుని గత నెలలో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'మెగా 157' రూపొందనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ద్వారా ఈ మూవీ ఇది సోషియో ఫాంటసీగా మూవీగా రానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ అనే శక్తి కోసం నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు కలుస్తున్నాయి. ఈ సారి మెగామాస్ యూనివర్స్‌ను దాటి ఉండబోతుందని అంటూ ఆ క్యాప్షన్‌లో పేర్కొంది.