తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mega 157 Latest Update : చిరంజీవి సోషియో ఫాంటసి సినిమాలో అనుష్క.. ఆల్మోస్ట్ కన్ఫామ్​! - చిరంజీవి వశిష్ట సినిమా

Mega 157 Latest Update : మెగా 157లో సీనియర్ హీరోయిన్ అనుష్క కన్ఫామ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

Mega 157 Latest Update : చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాలో అనుష్క.. ఆల్మోస్ట్ కన్ఫామ్​!
Mega 157 Latest Update : చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాలో అనుష్క.. ఆల్మోస్ట్ కన్ఫామ్​!

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 11:19 AM IST

Mega 157 Latest Update :రీసెంట్​గా 'మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ హీరోయిన్ అనుష్క... ప్రస్తుతం మరో సినిమాకు కమిట్ అవ్వబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అది మరెవరితోనో కాదు.. మెగాస్టార్ చిరంజీవితోనట.

Chiranjeevi Anushka Movie : చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసమే..అనుష్కతో చర్చలు జరుపుతున్నారట. ఈ డిస్కషన్స్​ చివరికి వచ్చిందని తెలిసింది. దాదాపు కన్ఫామ్ అని అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్​ సెట్​ అయితే కనుక.. అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం అనుష్క ఫిట్​నెస్​పై పూర్తి ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మీడియా ముందుకు కూడా రావట్లేదని సమాచారం.

ఇకపోతే తన తొలి చిత్రం 'బింబిసార'తో ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట.. మెగాస్టార్​తో సినిమాను ఎలా తెరకెక్కిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్​గా ఉండబోతుంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారట. రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మెగా మాస్ యూనివర్స్ అంటూ కాన్సెప్ట్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. పంచభూతాలతో డిజైన్ చేసిన ఈ పోస్టర్​ మెగా అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపింది. మరి ఇలాంటి భారీ సినిమాలో చిరంజీవితో కలిసి అనుష్క నటిస్తే ఆ కిక్కే వేరంటదని అభిమానులు అంటున్నారు. కాగా, గతంలో అనుష్క 'స్టాలిన్'​ సినిమాలో చిరుతో కలిసి ఓ స్పెషల్​ సాంగ్​లో నటించింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ గెస్ట్ రోల్​లో మెరిసింది. ఇకపోతే మలయాళంలోనూ అనుష్క రెండు చిత్రాలు ఒప్పుకుంది. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details