Mega 156 Movie Title : మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గురించి నెట్టింట ఓ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. ఫాంటసీ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మెగా 156 అనే టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ ఈ చిత్రం కోసం డిఫరెంట్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి 'విశ్వంభర'. కొత్తగా ఉన్నందున మూవీ టీమ్ దాదాపు ఈ టైటిల్‌నే ఖరారు చేయనున్నట్లు సమాచారం. కానీ దీనికంటే ముందు ఈ చిత్రానికి వేరే పేరును డిసైడయ్యారట.
ఇక చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాలు అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి'నే అందరికి గుర్తుస్తుంది. దీంతో చిరంజీవి- వశిష్ట మూవీ టైటిల్‌ను కూడా 'ముల్లోకాల వీరుడు' అని పెట్టాలనుకున్నారట. కానీ వైజయంతీ మూవీస్ సంస్థ ఈ విషయాన్ని గమనించి పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ టైటిల్‌ను పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న 'విశ్వంభర'ను మాత్రం దాదాపు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.
'మెగా 156' కోసం 'బాహుబలి' విలన్..
Mega 156 Movie Villain :మరోవైపు మెగా 156 సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం హీరో రానాను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయనతో దీని గురించి చర్చలు కూడా జరిపారని.. దానికి రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదేగనుక నిజమైతే ఒకే ఫ్రేమ్‌లో ఈ ఇద్దరు స్టార్స్‌ను చూసే అవకాశం కలుగుతుందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.