మెగా అభిమానులకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ బ్యానర్‌పై చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ చెప్పింది. చిరంజీవి 154వ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం ఓ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉన్నట్లు కనిపిస్తోంది. "బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా 154 విడుదల కానుంది" అని పేర్కొంది.
ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మెగా అప్డేట్ వచ్చేసింది.. ఆరోజు ఇక రచ్చరచ్చే! - పరంపర సీజన్ 2
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మెగా154' చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మాస్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇందులో చిరు ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే పేరు పెట్టనున్నట్లు ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ప్రకటించినప్పటికీ తాజాగా విడుదలైన పోస్టర్‌పై 'టైటిల్, టీజర్.. త్వరలోనే ప్రకటిస్తాం' అని చిత్రబృందం పేర్కొంది. మరి, ఈ చిత్రానికి చిరు చెప్పిన టైటిలే ఫైనలా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:షారుక్ కోసం ఆ పాత్రలో దీపిక.. బాధలో రణ్‌బీర్ కపూర్!