తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అమ్మ కూడా మనిషే.. ఆమె గురించి అలా రాయొద్దు'.. మీనా కూతురు ఎమోషనల్.. రజనీ కన్నీళ్లు!​ - మీనా సినిమాలు

Meena Daughter Emotional Speech: నటి మీనా కుమార్తె నైనిక మాటలతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణంతో అమ్మ మానసిక ఒత్తిడికి లోనైందని అదొక పెయిన్‌ఫుల్‌ టైమ్‌ అంటూ నైనిక చెప్పగా.. అక్కడే ఉన్న రజనీకాంత్‌, మీనా, ఇతర సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

meena daughter speech
meena daughter speech

By

Published : Apr 22, 2023, 9:49 AM IST

Updated : Apr 22, 2023, 12:16 PM IST

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. అనేక హిట్లు సాధించింది. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనిక అనే పాప కూడా జన్మించింది. గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందారు. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది మీనా.

అయితే ఇటీవలే మీనా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలంతా హాజరయ్యారు. మీనాను ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఒక్కసారిగా ఎమోషనల్​ అయ్యారు. మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్‌, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

"అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌నకు వెళ్లిపోయి చాక్లెట్స్‌ తింటూ కూర్చున్నా. ఆ రోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవలే న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు" అంటూ నైనిక కోరింది.

ఈ వీడియో చూసిన తలైనా రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్‌, బోనీకపూర్‌, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్‌ శ్రీదేవి, ప్రభుదేవా పాల్గొన్నారు. మీనాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలోనే మీనాను సర్‌ప్రైజ్‌ చేస్తూ నైనిక మాట్లాడిన ఓ వీడియోను ప్రదర్శించారు. దానిని తాజాగా విడుదల చేశారు.

Last Updated : Apr 22, 2023, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details