తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Matthew Perry Friends : 'చాండ్లర్​' మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. 'ఈ జనరేషన్​ ఓ ఫ్రెండ్​ను​ కోల్పోయింది' - మాథ్యూ పెర్రీ సిరీస్​

Matthew Perry Friends : ప్రముఖ హాలీవుడ్​ సిరీస్​' ఫ్రెండ్స్'​లోని కీలక పాత్రధారుడు, హాలీవుడ్​ నటుడు మాథ్యూ పెర్రీ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Matthew Perry Friends
Matthew Perry Friends

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 12:48 PM IST

Updated : Oct 29, 2023, 7:50 PM IST

Matthew Perry Friends : ప్రముఖ హాలీవుడ్​ సిరీస్​' ఫ్రెండ్స్'​లోని కీలక పాత్రధారుడు, హాలీవుడ్​ నటుడు మాథ్యూ పెర్రీ అకాల మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 54 వయసు గల ఆయన లాస్ ఎంజిలాస్‌లోని తన నివాసంలోని కన్నముశారు. దీంతో యావత్​ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది సెలబ్రిటీలు సోషల్​ మీడియా వేదిక ద్వారా ఆయన మృతి పట్ల సంతపం తెలుపుతున్నారు.

మహేశ్​ బాబు ఇన్​స్టాగ్రామ్ స్టోరీ
రణ్​వీర్ సింగ్​ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ
కరీనా కపూర్ ఇన్​స్టా స్టోరీ
బిపాసా బసు ఇన్​స్టా స్టోరీ
అమృత అరోరా ఇన్​స్టాగ్రామ్ స్టోరీ

అసలు ఏం జరిగింది?
Matthew Perry Death :లాస్ ఎంజిలాస్‌లోని మాథ్యూ పెర్రీ నివాసంలోని బాత్​ట‌బ్‌లో ఆయన పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆయన్ను పరిశీలించి ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మాథ్యు మరణవార్తను వెల్లడించారు. మ్యాథ్యూ పడిపోయి ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు థృవీకరించారు. డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నారేమోనని పరిశీలించారు. కానీ ఆయన ఎటువంటి డ్రగ్స్​ తీసుకోలేదని విచారణలో తేలింది. అయితే మాథ్యూ మృతికి గుండె పోటు కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Matthew Perry Career : 'ఫ్రెండ్స్' సిరీస్ ద్వారా బాగా అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మాథ్యూ పెర్రీ. 1994 నుంచి 2004 వరకు 10 సీజన్ల పాటు ప్రసారమైన ఈ సిరీస్​లో 'చాండ్లర్' అనే పాత్రను మాథ్యూ పోషించారు. తన కామెడీ టైమింగ్​తో అమాయకత్వంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. 'గో ఆన్', 'స్టూడియో 60 ఆన్ ది సన్‌సెట్ స్ట్రిప్', 'ది ఆడ్ కపుల్' లాంటి టీవీ షోలతో మాథ్యూ బుల్లితెర ఆడియెన్స్​కు మరింత చేరువయ్యారు. 1988లో రూపొందిన 'ఏ నైట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ జిమ్మీ రేర్డ‌న్' సినిమాతో మాథ్యూ పెర్రీ న‌ట ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. దాదాపు ఇర‌వైకిపైగా హాలీవుడ్ సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశారు. ఇక ఈ పాత్ర‌తో ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో జెన్నిఫర్ అనిస్టన్, కోర్ట్నీ కాక్స్, మాట్ లెబ్లాంక్, లిసా కుడ్రో మరియు డేవిడ్ ష్విమ్మర్ కూడా నటించారు. 2021లో ఫ్రెండ్స్ రీయూనియన్ షో కూడా జరిగింది.

హ్యారీపోటర్​ నటుడు మృతి.. ఆ కారణంతోనే..

Art Director Milan Fernandez Death : కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ 'మిలాన్ ఫెర్నెండెజ్' కన్నుమూత.. గుండెపోటుతో..

Last Updated : Oct 29, 2023, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details