తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నన్ను ఆపగలిగేవాడు అతడే'.. గూస్​బంప్స్​ తెప్పిస్తున్న 'రావణాసుర' ట్రైలర్​ - రవితేజ రావణాసుర ట్రైలర్​

మాస్​ మహారాజా రవితేజ హీరోగా నటించిన సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రావణాసుర' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మీరు చూశారా?

Raviteja Ravanasura trailer
రవితేజ రావణాసుర ట్రైలర్​

By

Published : Mar 28, 2023, 7:05 PM IST

Updated : Mar 28, 2023, 7:22 PM IST

మాస్​ మాహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్​లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలతో సూపర్ హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సుధీర్ వర్మ డైరెక్ట్​ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ.. ఏకంగా ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. మరో నటుడు సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్.. అభిమానుల్లో సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్ రిలీజై ఆ అంచనాలను మరింత పెంచింది.

ఈ ప్రచార చిత్రం చూస్తుంటే.. రవితేజ ఖాతాలో మరో హిట్​ పక్కా అన్నట్టుగా ఫ్యాన్స్​ భావిస్తున్నారు. ఇందులో న్యాయవాదిగా కనిపించిన రవితేజ తన మార్క్​ యాక్షన్​ కామెడీతో అదరగొట్టేశారు. ఆయన ట్రేడ్‌మార్క్ కామెడీ, డ్యాన్స్ మూమెంట్స్​.. స్క్రీన్​ ప్రెజెన్స్​లో చాలా బావున్నాయి. ఆయన క్యారెక్టర్​లో చాలా షేడ్స్​ కనిపించాయి. యాక్షన్ సీక్వెన్స్‌లతో మొదలైన ఈ ట్రైలర్​.. ఆ తర్వాత కామెడీ ట్రాక్​తో ఆకట్టుకుంది. క్రిమినల్ లాయర్​గా రవితేజ ఇంట్రడక్షన్​ కూడా అదిరిపోయింది. చూడచానికి చాలా బావుంది.

మొత్తంగా కథ గురించి రివీల్ చేయనప్పటికీ.. ట్రైలర్​ను బాగానే కట్​ చేశారు. సీన్స్​కు తగ్గట్టు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక డైలాగ్స్​ విషయానికొస్తే.. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్.. 'అంటూ నటుడు జయరామ్ చెప్పిన డైలాగ్ బావుంది. 'మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. నేను ఓ ఆర్టిస్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కేక పుట్టిస్తోంది. ఈ ప్రచార చిత్రంలో 'ఈ భూమ్మీద నన్ను ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే.. అది నేనే..' అంటూ మాస్​ మాహారాజా తన అభిమానులకు పూనకాలు తెప్పించారు. అలా ఈ ప్రచార చిత్రం పవర్ ఫుల్‌గా సాగింది. ఇదంతా చూస్తుంటే ఓ థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో రవితేజ ఆడియెన్స్​ ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్​లో తెగ ట్రెండింగ్ అవుతోంది. సినిమాను వరల్డ్​వైడ్​గా గ్రాండ్​ ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్​. దీని కోసం మాస్​ మహారాజా ఫ్యాన్స్​, అడియెన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించి.. రవితేజ హ్యాట్రిక్​ హిట్​ అందుకోవాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:బాలీవుడ్​లో బెల్లంకొండ శ్రీనివాస్​ సూపర్​​ రికార్డ్​.. ఏ హీరోకూ సాధ్యం కాని రేంజ్​లో!

Last Updated : Mar 28, 2023, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details