Chiranjeevi raviteja movies: కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాాజా పరిణామంతో ఆ ప్రచారానికి చెక్ పడింది. తాజా అప్డేట్ ఏంటంటే.. రవితేజ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' టైటిల్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.
శనివారం రవితేజ షూటింగ్లో జాయిన్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్డేట్ను ఆందిస్తూ.. ఆసక్తికర పోస్టర్ను విడుదల చేసారు. అంతేకాదు.. రవితేజను మెగాస్టార్ తన కారవాన్లోకి లాగేసినట్లు ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. సినిమా పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.