తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mark Antony Twitter Review : విశాల్​ 'మార్క్ ఆంటోనీ' ఎలా ఉందంటే ? - మార్క్​ ఆంటోనీ మూవీ రివ్యూ

Mark Antony Twitter Review :తమిళ హీరో విశాల్- ఎస్​జే సూర్య కాంబినేషన్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోని'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్​ ద్వారా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Mark Antony Twitter Review
Mark Antony Twitter Review

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 7:40 AM IST

Updated : Sep 15, 2023, 11:10 AM IST

Mark Antony Twitter Review : తమిళ హీరో విశాల్​ లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోని'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా ఎస్ జె సూర్య, సునీల్, రీతూ వర్మ, వై.జి. మహేంద్రన్‌, సెల్వ రాఘవన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్​తో అభిమానుల్లో భారీ అంచనాలు నిలిపిన ఈ మూవీ..శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్​ ద్వారా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Mark Antony Movie Review : ఇప్పటి వరకు 'మార్క్​ ఆంటోనీ'కి ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. సినిమా ఫస్ట్​ హాఫ్ బాగుందని.. యాక్షన్​ సీన్స్​ అదుర్స్​ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్​జే సూర్య కామెడీ టైమింగ్​ సూపర్​ అంటూ మరికొందరు అంటున్నారు. ఇక ఎస్​జే సూర్యతో పాటు విశాల్​ కూడా కామెడీతో అలరించారని టాక్​ నడుస్తోంది. సాంగ్స్​తో పాటు మ్యూజిక్​ కూడా ఈ సినిమాకు హైలైట్​ అంశాలు అని మరో నెటిజన్​ అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ సినిమా ఓ యాక్షన్ కామెడీ థ్రిల్లర్​ అని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, క్లబ్‌ సీక్వెన్స్‌, సిల్కు సీన్‌, క్లైమాక్స్‌లో ఫన్‌ ఓ రేంజ్​లో ఉన్నాయని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు.

Mark Antony Cast : భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి తమిళ స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​ జీ.వీ. ప్రకాశ్​ సంగీతాన్ని అందించారు. ఇక యాక్షన్ సీన్స్​ను పీటర్ హెయిన్స్, కనల్ కణ్ణన్, దిలీప్ సుబ్బరాయన్, దినేశ్​ సుబ్బరాయన్​లు తెరకెక్కించారు. మరోవైపు​ అభినందన్ రామానుజం ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. విజయ్ వేలుకుట్టి ఎడిటర్​గా వ్యవహరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్ వినోద్ కుమార్ నిర్మతగా వ్యవహరించారు. గ్యాంగ్‌ స్టర్‌, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్​ విభిన్నమైన లుక్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్​కు ఊరట.. ఆ రోజే 'మార్క్​ ఆంటోని' రిలీజ్

Last Updated : Sep 15, 2023, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details