Manjula Ghattamaneni Insta Post :సూపర్‌స్టార్ దివంగత క్రిష్ణ కుమార్తె, టాలీవుడ్ హీరో మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేశారు. బుధవారం నవంబర్ 8న తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ ఎమోషనల్ నోట్‌ను రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలను చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు.
సూపర్‌స్టార్ క్రిష్ణ గతేడాది నవంబర్ 15న కన్నుమూశారు. ఆయన మరణించిన కొద్దిరోజుల ముందు తన కూతురు మంజుల బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంజులు తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అందులో కృష్ణతో పాటు మహేశ్, నమ్రత, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కుమార్తె బర్త్‌డేలో పాల్గొన్న ఆయన.. మంజులకు కేక్ తినిపించారు.
'ఈ ఫొటోలు నాకు ఓ ప్రపంచం. ఇవొక టైమ్ క్యాప్సూల్స్ వంటివి. నా ప్రతి బర్త్‌డేకు మా నాన్న నాతో ఉన్నారు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న చిత్రం చివరిసారిగా నా పుట్టినరోజు నాడు నాన్న నాతో గడిపిన క్షణాలు. ఇది నాకు ఎప్పటికీ ఓ మెమోరీలా మిగిలిపోతుంది. ఈ ఫొటోలను నేను ఎప్పటికీ ప్రత్యేకంగా భద్రపరుచుకుంటాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ ఆయన కుటుంబంతో కలిసి చివరిసారిగా పాల్గొన్న వేడుక మంజుల బర్త్‌డేనే. ఈ ఫొటోలోనే ఆయన చివరసారిగా కనిపించారు.