టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకు ఉన్న గుర్తింపు తెలిసిందే. నటుడిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఆ కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ రీసెంట్గా ఓ వీడియోను రిలీజ్ చేసి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మంచు విష్ణు.. ఎవరో ఇంటి మీదకు వెళ్లి.. గొడవ చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్లో.. మనోజ్ మాట్లాడుతూ.. మా బంధవుల ఇంటి మీదకు ఇలా వచ్చి దాడి చేస్తూ ఉంటారండి అంటూ మాట్లాడారు. మళ్లీ ఆ వీడియోను డిలీట్ చేశాడు. అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో.. మంచు విష్ణు స్పందిస్తూ.. మనోజ్ తెలియక చేశాడంటూ కవర్ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్న ప్రచారం ఈ వీడియోతో మరింత ఊపందుకుంది.
ఇప్పుడు మళ్లీ ఆ గొడవ గురించి ప్రస్తావిస్తూ మరో వీడియోను రిలీజ్ చేశారు మంచు విష్ణు. 'ఇది కేవలం ఆరంభం మాత్రమే' అంటూ చెప్పుకొచ్చారు. House of Manchu Teaser పేరుతో దీనిని విడుదల చేశారు. ఈ వీడియోలో మంచు కుటుంబం ఇంటిని, కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు. చివరికి 'ఇదొక రియాలిటీ షోకు సంబంధించింది' అంటూ ఈ వీడియోను ముగించారు. అయితే, దీన్ని ఎందుకు విడుదల చేశారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మాత్రం భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.