Manchu Vishnu on Maa building and ticket rates: 'మా' ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగానే అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. 'మా' సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విష్ణు ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఏఐజీ సేవలను కొనియాడారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో 'మా' శాశ్వత భవనానికి భూమి పూజా చేయనున్నట్లు చెప్పారు.
'మా' భవనం, టికెట్ రేట్స్‌పై మంచు విష్ణు ఏమన్నారంటే? - maa elections
Manchu Vishnu on Maa building and ticket rates: మరో ఆరు నెలల్లో 'మా' శాశ్వత భవనానికి భూమి పూజా చేయనున్నట్లు చెప్పారు అధ్యక్షుడు మంచు విష్ణు. సినిమా టికెట్ ధరల విషయంలో తానెందుకు మాట్లాడలేదో వివరించారు.
"మా ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగానే అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. మరో ఆరు నెలల్లో భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాం. 'మా' సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే నా ప్రధాన కర్తవ్యం. అందుకోసం నా కమిటీతో కలిసి తగిన ప్రణాళికలు రచించాం. ఇక, సినిమా టికెట్ ధరల విషయంలో నేను మాట్లాడలేదని అందరూ విమర్శించారు. కావాలనే నేను సైలెంట్‌గా ఉన్నా. టికెట్ ధరలు పెంచితే కొందరికి.. తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులున్నాయని చెప్పారు. టికెట్ రేట్లు అనేది చాలా పెద్ద విషయం. దీని గురించి, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది" అని మంచు విష్ణు అన్నారు.
- ఇదీ చూడండి:అజ్ఞాతంలోకి అనసూయ!.. అందుకేనా?