Manchu Vishnu Kannapa Movie : టాలీవుడ్ స్టార్ హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా 'కన్నప్ప'. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్గా శ్రీకాళహస్తిలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది అదేంటంటే..
ఈ సినిమాలో నటి నుపుర్ సనన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. " డేట్స్ అడ్జెస్ట్మెంట్ విషయంలో సమస్యలు తలెత్తాయి. దీంతో నటి నుపుర్ సనన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని తెలుపడం బాధగా ఉంది. నపుర్ను మా టీమ్ చాలా మిస్ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం మరో నటీమణిని వెతికె ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం నుపుర్ చేస్తున్న ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే ఆమెతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. ఇక సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి" అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నారని, ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇక చిత్రానికి స్టీఫెన్ దేవాసి, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.