2023 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యగా చిరు, వీరసింహారెడ్డిగా బాలయ్య సందడి చేయనున్నారు. ఈ చిత్రాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీస్ మేకర్సే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ.. రెండు సినిమాలను ఒకేసారి ప్రమోట్ చేసేందుకు వినూత్నమైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బిగ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసి ఒకే వేదికపై చిరు-బాలయ్యను చేర్చాలని భావిస్తోందట. ఇకపోతే ఈ అగ్ర కథనాయకులిద్దరు కూడా మంచి స్నేహితులే. అలా వీరిద్దరిని కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా ఆలోచిస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్త జోరుగా ప్రచారం కావడం వల్ల మెగా-నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఒకే వేదికపై చిరు-బాలయ్య.. హోస్ట్‌గా మంచు విష్ణు.. ఫ్యాన్స్ సర్ప్రైజ్! - వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య
'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ కోసం ఓ భారీ స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు సోషల్‌మీడియాలో టాక్ నడుస్తోంది. ఒకే వేదికపై చిరు-బాలయ్యను చేర్చే విధంగా ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఒకే వేదికపై 'వాల్తేరు', 'వీరసింహా' ప్రమోషన్స్.. హోస్ట్‌గా మంచు విష్ణు!
మంచు విష్ణు హోస్ట్‌గా.. ఇకపోతే మరో క్రేజీ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'వాల్తేరు' మూవీటీమ్ నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'మా' అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆయనే హోస్ట్ చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కూడా నిజమెంతో తెలియదు గానీ మెగా ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు.
ఇదీ చూడండి:Tollywood 2022: క్రేజ్ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..