Dhanush The Grey Man update: తన సహజమైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ధనుష్. ప్రస్తుతం తొలిసారిగా హాలీవుడ్‌లో 'ది గ్రే మ్యాన్'లో నటిస్తున్నాడు. రుసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ధనుష్.. ఈ చిత్ర అనుభవాలను తెలిపారు. ఇందులో భాగస్వామ్యం అవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఎలాంటి అంశాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందో తెలిపారు. "ది గ్రే మ్యాన్ ఓ రోలర్‌కోస్టర్ వంటి చిత్రం. యాక్షన్, డ్రామా, క్రేజీ స్టంట్స్ ఇలాంటి ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసినందుకు, ఈ సినిమాలో నేనూ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా షూట్ అత్యద్భుతంగా సాగింది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్న" అని ధనుష్ వివరించారు. అనంతరం రుసో బ్రదర్స్ మాట్లాడుతూ.. త్వరలోనే ఇండియాకు రాబోతున్నట్లు తెలిపారు. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే విడుదలై ఈ సినిమా ప్రచార చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. కానీ అందులో ధనుష్ చాలా తక్కువగానే కనిపించారు. ఓ పోరాట సన్నివేశంలో భాగంగా కారు మీద ఉన్న ధనుష్ మంచి యాక్షన్ మూడ్‌లో ఉన్నట్లు ప్రచార చిత్రం ఉంది. మార్క్ గ్రీనీ రచించిన 'ది గ్రే మ్యాన్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఏవన్స్, జెసికా హెన్‌విక్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా జులై 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
సస్పెన్స్‌గా మంచు విష్ణు 'జిన్నా' ఫస్ట్‌లుక్.. ధనుష్ హాలీవుడ్ మూవీ సర్ప్రైజ్ - మంచు విష్ణు జిన్నా ఫస్ట్‌లుక్
హీరో ధనుష్ నటిస్తున్న హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వచ్చింది. దీంతో పాటే మంచు విష్ణు నటిస్తున్న 'జిన్నా' సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదలైంది.
Manchu Vishnu new movie first look: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం 'జిన్నా'. ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంతో సూర్య(Suryaah) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. అయితే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు. ‘విష్ణు సర్.. షాట్ రెడీ అయ్యింది’ అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎన్నిసార్లు పిలిచినా.. విష్ణు సెట్‌లోకి అడుగుపెట్టరు. దీంతో విసిగిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్.. కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ ఇచ్చిన సలహాతో విష్ణు వద్దకు వెళ్లి ‘జిన్నా.. షాట్ రెడీ’ అని చెప్పడం.. దానికి ఆయన ఫుల్ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో విష్ణు వైట్ అండ్ వైట్ ధరించి మాస్ లుక్‌లో కనిపించారు. కోన వెంకట్ అందించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోనీ సందడి చేయనున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇదీ చూడండి: 'విక్రమ్' యాక్షన్ సీక్వెన్స్.. పవర్‌ప్యాక్డ్‌గా మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?