మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం నుంచి తనతో పాటు తన కుటుంబంపై సోషల్‌మీడియాలో కొంత మంది తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారని సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఓ ప్రముఖ నటుడి ఆధ్వర్యంలో జూబీహిల్స్, బంజారాహిల్స్‌లోని రెండు కేంద్రాల నుంచి డబ్బులు పెట్టి తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని తెలిసిందని ఆరోపించారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మంచు విష్ణు.. ఆ ఛానళ్లకు వార్నింగ్ - మంచు విష్ణు ట్రోలింగ్
నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనతో సహా తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో సైబర్‌కు ఫిర్యాదు చేశారు.
మంచు విష్ణు
ప్రజలు తమను తప్పుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ట్రోల్స్‌పై కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే 18 యూట్యూబ్ ఛాన్సల్ పై చర్యలు తీసుకోనున్నట్లు విష్ణు హెచ్చరించారు. ఆన్లైన్ మీడియా పెరగడం వల్ల అవగాహన లేని చాలా మంది ట్రోల్స్ చేస్తూ తనలాంటి వాళ్ల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విష్ణు వాపోయారు.
ఇదీ చూడండి: సతీమణి స్నేహారెడ్డి బర్త్‌డే.. గోల్డెన్ టెంపుల్లో బన్నీ సెలబ్రేషన్స్